Dr. A. Taralakshmi: 

పుంసత్వ మ్


జగద్ గురువులు శ్రీ శంకర భగవత్ పాదులవారు రచించిన వివేక చూడామణి ప్రకరణ గ్రంధము లో నరజన్మ యొక్క విశిష్టతను వివరిస్తూ, ప్రాణి కోట్లలో నరజన్మ లభించడం కడు దుర్లభమని, నర జన్మ పొందిన వ్యక్తి పుంసత్వాన్ని పొందడం మరింత దుర్లభ మని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, పుంసత్వం అనే పదము కేవలం పురుషుల కు మాత్రమే సంబంధించిన అంశమా?
స్త్రీలు వేదాధ్యనమునకు యోగ్యులు కారా?
అన్న సందేహాలు సామాన్య ప్రజలకు కలుగక మానవు.
శంకరుల ఉద్దేశ్యం లో పుంస త్వము అనునది దేహధర్మము కాదు. అది మనోధర్మము.
ఉపనిషత్తులతత్వ విచారణ చేయగల సామర్థ్యం, ఆత్మ జ్ఞానాన్ని పొందగల ధృడ మనస్తత్వం ఎవరికై తే వుంటుందో వారు పుంసత్వ ము గలవారే.
ఇందు స్త్రీ పురుష లింగ బేధం లేదు. దృఢమైన జ్ఞానము, మనో ధైర్యము, రుజుత్వము, యోగారూఢత్వము, వైరాగ్య ము మొదలయిన లక్షణ ముల సముదాయాన్ని పుంసత్వం గా అభివర్ణించారు.
ఆధ్యాత్మిక మార్గం లో ప్రయానించడానికి అనువైన లక్షణ సముదాయాన్ని కల్గి ఉండడ మే పుమ్ సత్వం. అట్టి వారు స్త్రీలా లేక పురుషు లా అన్నభేద భావం లేదు.
వేద వాంగ్మయాన్ని నిశితంగా పరిశీలిస్తే శిష్యులుగను, ఉపాధ్యాయులుగను కీర్తి గడించిన ఎందరో స్త్రీ మూర్తుల ను గుర్తించ వచ్చు.
యాజ్ఞవల్క్య మహర్షి నుండి ఆత్మ జ్ఞానాన్ని పొందిన మైత్రేయి, తత్వ జ్ఞాన పోటీలో యాజ్ఞవల్క్య మహర్షి కే న్యాయ నిర్నేతగా వ్యవహరించిన గార్గి, కుమారుడు కపిల ముని వద్ద ఆత్మ జ్ఞానాన్ని పొందిన దేవహూతి, శిఖి ధ్వజునకు బోధ సల్పిన చూడాల వంటి స్త్రీమూు ర్తులు ఎందరో వేద విజ్ఞానానికి వన్నె తెచ్చినారు. 






Comments
Post a Comment