Dr. A. Taralakshmi: 
ఆధ్యాత్మిక విచారము

ఆత్మ నిత్యుడు,నిర్వికారుడు,శాశ్వతు డు అనియు దేహము అనిత్యము, అశాశ్వితం మరియు నశిన్చునది అనియు గ్రహించి, ఆత్మానాత్మ వివేకము కలిగిన వాడై
మానవుడు నిరంతరము ఆధ్యాత్మిక తత్వ విచారణ చేయాలి
.
స్వజనులు మరణించినపుడు మనకు దుఃఖం ఎందుకు కలుగుతూ ఉంటుంది?
పరిశీ లిస్తాం
.
నాశ రహితమైన ఆత్మ ను గురించి దుఃఖం పొందుట శుద్ధ అవివేకం
.
అనిత్యమైన దేహము గురించి ధుఃకించుట మరింత అవివేకం
.
కంటికి కనిపించే దేహపు రూపురేఖలపై వ్యామోహముతోనూ, అది నశించి పోవుచున్నదే అన్న భావనతోనూ సామాన్య జనులైన మనకు సహజముగా దుఃఖము కలుగుతూ వుంటుంది
.
పంచభూతాలతో సృష్టించ బడి, షట్భావ వికారాలలో కూడిన ఈ దేహము నశించి తీరవలసిందే
.
పాత చొక్కాను విడిచి కొత్త చొక్కాను ధరించినట్లు జీవుడు కర్మలచే సుఖ దుఃఖాలను అనుభవించుట కొరకు, శిధిల మైన దేహమును విడిచి నూతన దేహమును పొందుతా డు
.
నిత్యుడైన ఆత్మ నూతన దేహమును పొన్ది లోకాంతర యాత్రను కొనసాగిస్తాడు
స్థూల శరీరమునకు శాశ్వతత్వం లేదు. ఆత్మకు అశాశ్వ తత్వం లేదు
.
ఆత్మ యందు అనాత్మ తత్వమును ఆరోపించుకొని జనులందరము దుఃఖమును పొందుచున్నాము
.
రైలులో మనము వేగంగా ప్రయాణం చేస్తున్న నప్పుడు చెట్లూ చేమలు, కొండలు, గుట్టలు, అవికూడా వేగంగా ప్రయాణం చేస్తున్నట్లు భ్రాంతి కలుగుతూ వుంటుంది.
.
అనిత్య మైన దేహము నశించుచుండగా , అందుకు భిన్నంగా, నిత్యమైన ఆత్మ నశించున్నట్లు భావిస్తాము.
.
ఇది గొప్ప అజ్ఞానము .
ఏది ఆత్మ ? 
ఏది అనాత్మ ?
అన్న వివేకాన్ని మరియు నిత్యా నిత్య వస్తు పరిజ్ఞానాన్ని మనం సాధన చేసి వున్నచో , అనాత్మ మరియు అనిత్యమైన ఈ దేహము నశించుచున్నపుడు ఎటువటి దుఃఖముకలుగదు
.
Comments
Post a Comment