Dr. A.
Taralakshmi: నరజన్మ దుర్లభం
సంసార చక్రమున పరిభ్రమిస్తూ జనన మరణాల గొలుసులో బంధింప బడిన జీవుడు ఉత్తమ, మధ్యమ మరియు అధమ శరీర ములను పొందుటకు వారి వారి గత జన్మల పుణ్య, పాప మరియు మిశ్రమ కర్మలే కారణము.
ఇది పుణ్యం, ఇది పాపం, ఇది మిశ్రమం అని త్రివిధ కర్మల స్వరూపాలను తెలిసికొనుటకు సాధ్యమైనదిబుద్ధి.
ఇట్టి బుద్ధి కేవలం మానవునకు మాత్రమే ప్రసాదిమ్పబడింది.
మానవుడు బుద్ధి శక్తి చేత మంచి చెడులను తెలిసికొన గలడు. మంచిని ఆచరించ గలడు మరియు చెడును విసర్జింప గలడు. తత్ఫలితము లను పొందగలడు.
ఇంతటి సదవకాశం కలది కనుక ప్రాణులన్నింటిలో మానవ జన్మ ఉత్తమమైనది గా పేర్కొన బడినది.
వివేక చూడామణి గ్రంధం లో శంకర భగవత్ పాదులు పూర్వ జన్మల లో చేసుకున్న సుకృతములను బట్టి భగవంతుడు నరులకు ప్రసాదించే తొమ్మిది యోగ్యత లను పేర్కొన్నారు.
దుర్లభ మైన నరజన్మ ను పొందిన జీవుడు మరింత యోగ్యత కల్గిన వాడైతే ఆతనికి పుంసత్వం అనే గుణం ప్రసాదిం ప బడుతుందట. పుంశత్వం అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందే అర్హత కలిగి వుండడమేనట .
పుంశత్వం కల్గిన మానవుడు సత్వగుణ సంపన్నుడు గా ఉండగలగడం మరింత యోగ్యత అంటారు శంకరులు.
దుర్లభ మైన మానవ జన్మను పొంది, పుంసత్వము కలిగి, సత్వ గుణ సంపన్నుడు ఐనట్టి మానవుడు మరింత ఎక్కువ యోగ్యత కల్గిన వాడైతే ఆత ను , వైదిక ధర్మ మార్గ ఆచరణ పరాయనుడై వుంటాడని, చిత్తశుద్ధి చిత్తఏకాగ్రత కల్గి ఉంటాడని, వైదిక ధర్మ మార్గ మును నిష్టగా ఆచరిస్తాడని శంకరులు వివరిస్తారు.
మరింత యోగ్యత కల్గిన వ్యక్తి కి పై నాలుగు గుణాలతో పాటు విద్వత్వం అనే మరొక యోగ్యత కూడా ప్రసాదింపా బడుతుండట. ఈ విద్వత్వం కలిగిన మానవుడు క్లిష్ట మైన ఆధ్యాత్మిక రహస్యాల పరమార్థ ములను అత్యంత సులువు గా అర్ధం చేసు కుంటారట.
ఇక పోతే ఆత్మఅనాత్మ వివేచనా జ్ఞానం కలిగి వుండడం మరింత గొప్ప యోగ్యత గా ఆచార్యులవారు వివరిస్తారు.
తాను సాధించిన ఆత్మ జ్ఞానాన్ని తనకు తానుగా అనుభవము పొందడం ఇంకా గొప్ప యోగ్యతగా జగద్గురువు అభివర్ణిస్తారు.
స్వానుభవము పొందిన తదుపరి అట్టి సాధకుడు తన ఆత్మ ను నిరంతరము ఆ పరబ్రహ్మము నందు లీనం చేసి బ్రహ్మాత్మనా సమస్థితిని పొందుతారు. ఇట్టి సాధకుని జీవన్ముక్తుడు అంటారు.
ఇట్టి జీవన్ముక్తుడు తన ప్రారభ్ధాన్ని తొలగించుకొని జనన మరణాల గొలుసు నుండి విడివడి మోక్ష సామ్రాజ్యం చేరు తాడు.
సాధకుడు పై చెప్ప బడినశోపాన ములలో తన స్థాయి ని తెలిసికొనుటకు, పురుష కార్యము తో తదుపరి స్థాయి లకు చేరుటకు ప్రయత్నము చేయుటకు ఈ శ్లోకము ఎంతగానో తోడ్పడ గ లదు.
విశిష్ట మైన నరజన్మ కు మాత్రమే ఇట్టి సదవ కాశము కలదు . కనుక మానవుడు పురుషార్ధప్రదమైన తన జన్మ గొప్ప తనమును గ్రహించి దానిని సార్థకం చేసికొనుటకు ప్రయత్నించాలి.
Dr. A. Tara Lakshmi
Comments
Post a Comment