Dr. A. Taralakshmi:
ఆత్మ ను తెలిసి కోవడం ఎలా?
ఆత్మను తెలిసి కోవడం ఎలా? అని ప్రశ్నించిన శిష్యు నకు, గురువు నకు మధ్య సంభాషణ ఈ క్రింది విధంగా సాగుతోంది
.
గురువు: ఈ ప్రపంచాన్ని నీవు పగటి పూట దేని ఆధారంగా చూస్తూ వున్నావు?
శిష్యుడు: సూర్యుని నుండి కలిగే వెలుగు వలన చూస్తున్నాను.
గురువు: రాత్రి వేళల్లో దేని ఆధారంగా చూస్తున్నావు?
శిష్యుడు: దీపం సహాయంతో చూస్తున్నాను
.
గురువు: పగలుసూర్యుని, రాత్రి దీపం ఆధారంగా చూస్తున్నావు బాగానే వుంది! అయితే ఆ రెంటినీ ఏ వెలుగుతో చూడగలుగు తున్నా వు
.
శిష్యుడు: కంటిలో నున్న వెలుగు సహాయం తో చూడ గలుగుతున్నాను
.
గురువు: అలాగా? అయితే నీవు కనులు మూసుకుని కూడా మనో నేత్రం తో దృశ్యా లను చూడగలుగు తున్నావా? లేదా? గమనించు
.
శిష్యుడు: అవును చూడగలుగు తున్నాను
.
గురువు:. స్వప్నంలో మనో ప్రపంచాన్ని సృష్టిస్తున్నది ఎవరు?
.
అచట విషయాలు తెలుస్తున్నాయి కదా? అది ఎలా సంభవి స్తోంది?
శిష్యుడు:. మనో బుద్దులు పని చేస్తువుండుట వలన, స్వప్న ప్రపంచం లో విషయాలను గ్రహించ గలుగు తున్నాను
.
గురువు: సుషుప్తి లో మనో బుధ్ధులు కూడా లయం చెంది, మెల్కొన్నాక నేను చాలా హాయిగా నిద్రించాను అని గుర్తించేది ఎవరు?
.
జాగ్రద్ అవస్థ లోయింద్రియాలు మరియు అంతః కరణ సాయంతో భౌతిక స్వరూపాన్ని, స్వప్నం లో అంతః కరణ సాయంతో స్వప్నాన్ని, సుషుప్తి లో దేని సహాయమును అపేక్షింపక తనకు తానుగా ప్రకాశించే వెలుగు ఏదైతే ఉందో అదే ఆత్మ
.అదే అన్నింటినీ ప్రకాశింప జేసి సాక్షి చైతన్యము.
. అవిద్యా ఉపాధి తో కూడిన సత్ చిత్ ఆనంద స్వరూప మే జీవాత్మ.


గురువు గారి సమాధానము తో శిశ్యునకు ఆత్మజ్ఞానము సిద్ధించింది.




Comments
Post a Comment