Dr. A. Taralakshmi:
దేహాభిమానం ఓ పాశము
జీవుడు మూడు రకాల దేహాలను కలిగి వుంటాడని వేదాంతం తెలియ జేస్తుంది.
అవే స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరాలు. ఈమూడింటి నీ అనాత్మఅంటారు. 
జీవుడు స్వతహాగా తాను సత్ చిత్ ఆనంద స్వరూపుడు, నిస్సంగుడు, నిష్క్రిాయుడు, స్వప్రకాసుడు అయినప్పటికీ అవిద్య కు వసుడై గృహస్థు ఎలాగైతే ఇది నా గృహము, వీరు నా భార్య పుత్రులు అని వ్యవహరిన్చుచున్నా డో జీవుడు కూడా ఈ శరీరము నకు అధిపతి అయి, శరీరము తో, ఇంద్రియాలతో కలిసి నా కన్ను నా చెవి అని వ్యవహరి న్చుచున్నాడు.
శరీరము నందు, శరీరము నకు సంబంధించిన విషయముల యందు, జీవునకు కల భ్రాంతి యే మోక్షానికి మొదటి ప్రతిభంధకము.
చర్మము, మాంసము, రక్తము, రక్తనాళాలు కొవ్వు, మజ్జ,ఎముకలు, తల, చేతులు, కాళ్ళు మొదలైన అంగాలు అన్నింటితో కూడిన భౌతిక కాయాన్ని స్థూల శరీరం అంటారు.
ఇది పంచభూతాల నుండి తయారు అవుతుంది. అన్నం నుండి పుట్టి, అన్నం నుండి పెరిగి అన్నం లో లీనమవుతుంది. 
అంటే పంచభూతాలతో తయారైన అన్నం లో నుండి పుట్టి, మరణం తరువాత తిరిగి పంచభుతాలలో లీనమావుతుంది. 
గత జన్మలో చేసిన సుకృతాల వలన ఈ స్థూల శరీరం లభిస్తుంది.
సుఖ మరియు దుఖ అనుభవాలను పొందుతుంది
ఇది భోగములు కుమూలము. స్థూల పదార్థ అనుభవమున కు సాధనము.
షడ్ భావ వికారాలు దీని లక్షణాలు.
స్థితి, పుట్టుట, పెరుగుట, పరిణతి, విపర్యం మరియు నశింపు, ఈ ఆరింటిని షట్ భావ వికారాలు అంటారు.
స్థూల శరీము ఒక కోశము వలె జీవాత్మ ను కప్పి ఉంచి జీవాత్మ ను మరుగు పరుస్తూ వుంటుంది.
జీవుడు దేహమే తానని భావించు చున్నాడు. పంచ జ్ఞానేంద్రియాల కు చెందిన విషయ సుఖములను పొందు చున్నాడు.
నీవు గృహము కలిగి వున్నావు. అంతే కాని నీవే గృహము కాదు. నీవే శరీరము అని భావిస్తూ అది చేసే పనులన్నింటినీ నీవే చేస్తున్నట్లు గా భావించడం నీ మోక్ష మార్గానికి మొదటి ప్రతిభ న్దకం. దానిని విడనాడవల లెను అని సకల శాస్త్రాలు ఎలుగెత్తి చా టు తున్నాయి.




Comments
Post a Comment