ప్రెయో మార్గమును ఆశ్రయించిన వ్యక్తి కామ్య కర్మలు చేయుచు, అజ్ఞాన వశమున జనన మరణ రూపమగు సంసార సాగరంలో కొట్టు మిట్టాడు చున్నాడు.
ఇట్టి జీవుడు బహు జన్మలలో చేసిన సత్కర్మల ఫలితముగా అనేక జన్మల అనంతరము భగవంతుని అనుగ్రహం వలన మోక్షఅభిలాష కలుగు చున్నది. అట్టి మానవుడు సద్ గురువును ఆశ్రయించి విచారణ చేసి ఆత్మ స్వరూపమును తెలిసికొనును. జగత్తును గూర్చిజీవుని గురించి,పరమాత్మ ను గూర్చి సదా విచారించే జీవునకు ఆత్మ సాక్షాత్కారం జరుగును.
శ్రవణ,మనన, నిధి ధ్యాసనములను అనుష్టించి సంచితము లోనున్న కర్మ ఫలాలను మరియు వాదనలను సమూలంగా నశింప జేయాలి.
వేద ప్రతిపాదిత మహవాక్యముల అర్ధమును విచారియించుటను శ్రవణమ అనియు ఏకాంతమున పరమార్ధం ను అనుసనందించడాన్ని మననం అని శ్రవణ మననము ల వలన గ్రహించిన జ్ఞానమును మనస్సు నందు నిలిపి ఉంచుటను నిధి ధ్యాసనము అని చెప్పుదురు. ధ్యానము ధ్యాత మరియు ధ్యేయము అను త్రిపుటిని వదలి గాలి లేని చోట వెలుగు దీపము వలె నిశ్చల స్థితి లో వుండిపోవుటను సమాధి అందురు. సమాధి సాధించిన సాధకునకు వాసనలు అన్నీ నశించి కర్మ ఫలాలు సమూలంగా నశించును. అట్టి సాధకుడు జీవన ముక్తుడు అగును.
|
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment