మనస్సు అంటే మరేదో కాదు, ఆలోచనల సమాహారమే
.
సంకల్ప సమూహాలతో నే జగత్తు కల్పించ బడింది
.
ఎచట మనస్సు క్రియాశీకంగా వుంటుందో అచట ప్రపంచం వుంటుంది.
వ్యక్తిని ప్రపంచానికి కలిపేది మనస్సే
ప్రాణుల దుఃఖానికి, రాగ ద్వేషాలకు జనన మరణాలకు సంకల్ప రూపమైన మనస్సే కారణం
.
జాగ్రత అవస్థ లో మనస్సు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సంచరిస్తే నే విషయాలు గ్రహించ బడుతున్నాయి.
స్వప్నంలో మనో ప్రపంచాన్ని సృష్టించేది మనస్సే.
మరి గాడ నిద్రలో ఈ మనస్సు పూర్తిగా పనిచేయటం లేదు. కాబట్టి హాయిగా నిద్రించాను అంటున్నావ్.
ఈ హాయి ఎక్కడినుండి వచ్చిందో విచారించావా?
మెలుకువ లో ఆలోచనలను పూర్తిగా అదుపు చేస్తే , గాఢ నిద్రలో పొందే హాయిని మెలుకునే అనుభవించ వచ్చును కదా? 
అందుకే ఆలోచనలను అదుపు చేద్దాం.
అమనస్క స్థితిని అలవాటు చేసుకుందాం.
ఈ ప్రయత్నం లో అనుసరింవలసిన ఉపాయాలే ధ్యాన, ధారణ మరియు సమాధి స్థితులు


Comments
Post a Comment