మన భరత భూమి వేద భూమి. అందరిలో అంతర్యామి గా వ్యాపించి ఉన్న పరమాత్మ ఒక్కడే అని వేదం బోధిస్తుంది. నీవు నేను అనే భావాన్ని తర్క బద్ధంగాకాక ఆధ్యాత్మికంగా పరిశీలించారు భారతీయులు. భిన్నత్వం లో ఏకత్వం చూసే ఔదార్యాన్ని మన సంస్కృతి మనకు భోదించింది.సర్వ ధర్మ సత్యత్వాన్ని, సామరస్యాన్ని ఎలుగెత్తి చాటింది మన సనాతనధర్మం. ఓ వైపు గంభీర మైన మాట విశ్వాసం, మరో వైపు అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం మనకే సొంతం. మార్గాలు వేరు కావచ్చు సత్య మొక్కటే, అన్ని మతాలు చాటే ధర్మ మొక్కటే.
మత ధర్మాల స్వేచ్ఛను మానవుల మధ్య పరస్పర వ్యవహారాలలో వివేకాన్ని కృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు మరియు ఆదిశంకరులు ఇలా ఎందరో మహానుభావులు భోదించి వున్నారు.
మత ధర్మాల స్వేచ్ఛను మానవుల మధ్య పరస్పర వ్యవహారాలలో వివేకాన్ని కృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు మరియు ఆదిశంకరులు ఇలా ఎందరో మహానుభావులు భోదించి వున్నారు.
నన్ను ఎవరు ఏ విధంగా అశ్రయిస్తారో వారిని నేను ఆ మార్గము ద్వారా స్వీకరించెదనన్న భగవానుని ఉవాచ సర్వత్రా అనుసరణీయము.
సహన శీలత భారతీయ సంస్కృతి లో అంతర్భాగం.ఈ విషయాన్ని వివేకానందుల వారు చికాగో సమావేశములో ప్రస్తావిస్తూ " సర్వ మత సత్యమును సమానత్వమును లోకానికి చాటిన సనాతన ధర్మము నా ధర్మమని గర్వించుచున్నాను" అని నొక్కి వక్కాణించారు.
కనుక. సర్దుబాటు స్వభావంతో ఒడిదుడుకులను ఎదుర్కొని ధర్మాచరణ లో సపోదాం.
🕉 శుభమ్,🕉
కనుక. సర్దుబాటు స్వభావంతో ఒడిదుడుకులను ఎదుర్కొని ధర్మాచరణ లో సపోదాం.
🕉 శుభమ్,🕉
Comments
Post a Comment