Skip to main content

పరమ సుఖం

💐💐💐💐పరమ సుఖం💐💐💐

ప్రపచవ్యాప్తంగా సమస్త మానవాళి సుఖాన్ని కోరుకుంటారు.  దుఃఖాన్ని ఎవ్వరూ అపెక్షించరు. సుఖం అనే పదము సు+ఖమ్ అను రెండు పదాల కలయికతో ఏర్పడింది. సు అంటే అనుకూలం గా ఖమ్ అంటే ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు అన్నీ అనుకూలంగా వుండడమే సుఖం అను పదానికి అర్ధం.

సుఖం రెండు రకాలు. మొదటిది సామాన్య సుఖం . రెండవది పరమ సుఖం.

బాహ్య విషయముల నుండి జనించే సుఖం సామాన్య సుఖం.  ఇది తాత్కాలికం. ఎటువంటి కోరికలు లేక మనస్సు ను అంతర్ముఖ ము చేసినపుడు కలిగే సుఖం పరమ సుఖం.  కోరికలు లేని సంతృప్తి చెందిన మనస్సే సుఖానికి మూల కారణం. ఆధ్యాత్మిక పరి భాష లో పరమ సుఖాన్ని మోక్షం, ముక్తి,కైవల్యం వంటి పదాలతో పిలుస్తారు.
💐Dr. Tara Lakshmi💐

Comments