Dr. A. Taralakshmi:
అంతః కరణము
మనము ఏ పని చేయాలన్నా సాధనము లేక పరికరము అవసరం. దీనినే కరణము అంటారు. 
కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదింటిని జ్ఞానేంద్రియ పంచకము అంటారు.
వాక్కు , పాణి, పాదము, పాయువు, ఉప స్థ, ఈ ఐదింటిని కర్మేంద్రియ పంచకము అంటారు. 
మనస్సు, బుద్ధి, చిత్తము అహం అను నాల్గింటిని అంతఃకణం అంటారు.
దేహము బాహ్యము లో ప నిచేయడానికి జ్ఞానేంద్రియ మరియు కర్మేంద్రియాలు బాహ్య కరణం గా పనిచేస్తాయి.
అంతః సాధనకు అంతకరణం ఉపయోగ పడుతుంది.
నిజానికి అంతఃకరణ లో వున్న నాలుగూ, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహం ఒకే మనస్సు యొక్క వివిధ రూపాలు.
ఒకే మనస్సు ను అది చేసే పనిని బట్టి నాలుగు పేర్లతో పిలుస్తుంటారు
సంకల్ప మరియు వికల్పాలు చేయడం మనస్సు పని. మంచి చెడుల నిశ్చయం బుద్ధి చేసేపని. కర్తృత్వ మరియు భోక్తృత్వ భావనలు చేసేది అహం. వృత్తులకు ఆలవాలం చిత్తం.
ఇలా ఒకే మనస్సు చేసే పనిని బట్టి నాలుగు పేర్లతో , నాలుగు రకాలు గా పిువబడుతుంది.
అంతఃకణం పంచకం జ్ఞానేంద్రియాల కంటే వేరుగ వుండి వాటిని నడిపిస్తూ వున్నందున దీనిని అంతరే న్డ్రియం అని కూడా అంటారు.
ఈ అంతఃకరణము నకు ఇచ్చా శక్తి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి అను మూడు శక్తులు వుంటాయి.
ఈ అంతఃకరణ మును సత్వ రజస్ తమోగుణ ములు కలిగిన ప్రకృతి అని కూడా పిలుస్తారు.
ReplyForward
|
Comments
Post a Comment