సంతృప్తి సంతోషాల తో నిండిన మనస్సు గల వారికి ప్రాప్తించే సుఖం మోహ గ్రస్తులకు ఎన్నటికీ లభ్యము కాదు.
రంగుటద్ధాల తో లోకాన్ని చూస్తే సమస్తం రంగుల మయం గా కనిపిస్తుంది. వ్యక్తి మానసిక స్థితిని బట్టి సృష్టి గోచరమవుతుంది. నీ మనస్సు సంతోషం గా వుంటే చుట్టూ ప్రపంచం అద్భుతం గ వుంటుంది. అదే మనస్సు దుఃఖం తో నిండి వుంటే ఎటు చూచినా నీకు దుఃఖమే అనుభవము అవుతుంది. వ్యక్తి మానసిక స్థితిని నీ బట్టి ప్రపంచం వుంటుంది కానీ ప్రపంచాన్ని అనుసరించి చిత్తం ఉండటంలేదు.
కావున మనస్సును ఎల్లప్పుడు సంతోషం గా వుంచుకుంటే వ్యక్తి జీవితం సుఖమయం కాగలదు. మనస్సు కున్న అమోఘమైన శక్తి యక్తులను పరిపూర్ణం గా ఉపయోగించుకో గలిగితే మానవుడు అన్ని విధాలా అభవృద్ధి సాధించగలడు.
Comments
Post a Comment