Dr. A. Taralakshmi: 
నాహం.......సోహం

నాహం.....
నేను దేహమును కాను....
నాకు జనన మరణములు ఎచట?
నేను ప్రాణములను కాను.....
ఆకలిదప్పులు నాకెచ్చట?
నేను చిత్తమును కాను......
శోకమోహములు నా కెచ్చట
నేను కర్తను కాను......
నాకు బంధ మోక్షము లెచ్చట?
పంచ భూతములను నేను కానే కాను....
నామ రూపములు నాకు లేనే లేవు......
మరి ఇంతకీ నేెవరిని?
నేను........
నిత్యుడను.
ముక్తుడను.
చిన్మాతృడను.
బుద్దుడను.
నిర్మలుడను.
చిదాత్మను.
నేను పరాపర రహితుడను.
సర్వ సాక్షిని.
సర్వజ్ఞుడను.
సర్వ వ్యాపకుడను.
జ్ఞాన స్వరూపుడను.
పరిపూర్ణుడను.
ఆనంద స్వరూపుడను. అఖండ స్వరూపుడను.
సర్వ ప్రకాశ స్వరూపుడను.
నేను.


చిన్మాత్ర జ్యోతి స్వరూపుడను నేను.

సర్వ వేదాంత వేద్యుడగు బ్రహ్మమును నేను.


Comments
Post a Comment