🕉🕉తారా లక్ష్మీ🕉🕉
దేహాభిమానము ముక్తీ కి అడ్డుగోడ. వివేకముచేత దానిని పోగొట్టికొనవచ్చును. జడము పంచ భూతాత్మకము అయిన మానవ దేహము యొక్క తళుకు బెళుకులకు మురిసి పోకుండా నర జన్మ యొక్క లక్ష్యాన్ని గుర్తెరిగి పరిపూర్ణ సుఖ శాంతులను ఎట్లు పొందవలెనో విచారించవలెను. జీవించి ఉన్నంత కాలం సత్య నిష్ఠ తో ధర్మ నిష్ఠ తో , భగవద్ భక్తి తో, పరోపకారస్వభావంతో మెలగవలెను. దేహము శిథిలము కాక మునుపే శక్తియుఖ్తులు ఉన్నపుడే మనస్సును వశము చేసికొని బుద్ధిని బలోపేతము చేసికొని ఘోర సంసార సముద్రమును దాటి భవ బంధములనుండి విముక్తికై కృషి చేసి భయ రహితము శాశ్వత ఆనందము పొందుటకు జనులు కృత నిశ్చయులు కావలయునని శాస్త్రములు గురువులు భోధించుచున్నారు.
Comments
Post a Comment