Dr. A. Taralakshmi: 

జ్ఞానం


ఆధ్యాత్మిక పరిభాష లో జ్ఞానం అనే పదము నకు అర్ధము, వున్నది వున్నట్లు గా చూడడము.
వున్నదానిని వున్నట్లు చూడలేక పోవడమే కాక దానినే వేరొక రకంగా చూడడం కూడా అజ్ఞానమే.
దీనినే అవిద్య అనికూడా అంటారు.
ఉదాహరణకు తాడును తాడుగా చూడలేక పోవడమే కాకుండ, తాడులో పామును చూడడం, ఈ రెండూ అజ్ఞానం కారణంగానే జరుగుతూ వున్నాయి.
ఈ విధంగానే కనిపించే ఈ పాంచ భౌతిక దేహాన్ని , ఇంద్రియాలను,మనోబుద్దుల ను, ప్రాణములను తానే అనుకుని వాటితో తాదాత్మ్యం చెంది మన నిజ స్వరూపాన్ని తెలిసికొన లేక దుఃఖాలకు లోనవుతున్నాము.
ఇవన్నీ అజ్ఞానం కారణం గానే జరుగుతూ వున్నాయి.
దేహెంద్రియ మనోబుద్ధులకు చైతన్యాన్ని ఇచ్చే చైతన్యమే ', నేను' . 
దానినే ఆత్మ అంటుంది శాస్త్రం. 
ఆ చైతన్యం నేను అని గ్రహించలేక పోవడమే అజ్ఞానం.
అజ్ఞానం తొలగిన జీవునకు దేవునకు మధ్య భేదమే లేదు.
ఆ జ్ఞానమే ప్రజ్ఞానం
ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము
అది నేనే అయి ఉన్నాను
ప్రజ్ఞానం బ్రహ్మ
🏻
అహం బ్రహ్మాస్మి
🏻
Comments
Post a Comment