Skip to main content

వినయము

💐Tara Lakshmi💐
లౌకికమైన జ్ఞానం కానీ లేదా పార లౌకికమైన జ్ఞానం కానీ సముపార్జించాలంటే వినయము ఎంతో అవసరం.   అణకువ శ్రద్ద లోపిస్తే సత్యాన్వేషన ఫలించదు.  అందునా ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో శ్రద్ధ అత్యంత ఆవశ్యకం.  నేను అనే అహం తొలగినపుడే ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది.
వినయము శ్రద్ధ లోపించిన ప్రశ్నలు నిరార్ధకం నిష్ఫలం.  వినయంతో వేసే ప్రశ్న లో జవ సత్వాలు ఉంటే సమాధానం పది రెట్లు ఎక్కువ అవుతుంది.  సృజనాత్మక
వినయపూర్వక సందేహాలే జ్ఞానోదయనికి హేతువు.
సనాతన భారతీయ వేద వాఙ్మయమంతా గురు శిష్య  ప్రశ్నోత్తరాల సంవాద రూపంలోనే ఉంటుంది.
శిష్యునీ యొక్క ప్రశ్నల ద్వారా అతని  జ్ఞానాన్ని అంచనా వేయవచ్చును.

Comments