Dr. A. Taralakshmi: 

ఆత్మ విద్య


"యమ ధర్మరాజా ! మరణము అనంతరము ఆత్మ వుంటుందా? లేదా? అనే సందేహం కలుగుతోంది. దీనిని మీరు నివృత్తి చేయండి" అంటూ తన మూడవ వరాన్ని కోరాడు నచికేతుడు.
ఆత్మ జ్ఞానోపదేశానికి నచికేతుడు అ ధికారా? కాదా? అని యముడు పలు, పలు రకాల ఆతనిని పరీక్షించిన తదుపరి
క్రింది విధంగా నచికేతునకు బోధ చేస్తారు.
నచికేత !
" మానవుడు తరించ డానికి రెండు మార్గాలున్నాయి. అవి శ్రేయోమార్గం మరియు ప్రేయో మార్గం. అందు శ్రేయోమార్గం నిత్యమైన ఫలాన్ని, ప్రేయోమార్గం అనిత్యఫలాన్ని ఇస్తుంది. వివేకవంతుడు శ్రేయో మార్గాన్నే ఎన్నుకుంటాడు.
ఆత్మ నిగూడమై నది. మానవులలో పెక్కు మంది ఈ ఆత్మ తత్వాన్ని వినుటకు కూడా నోచుకోరు. వినాలన్న ఆసక్తి గల వారికి కూడా ఈ ఆత్మతత్వాన్ని వివరించి బోధ చేసే వారు దొరకడం కడు దుర్లభం. ఒకవేళ ఉపదేశించే వారు లభించినా ఉపదేశాన్ని గ్రహించి మననము మరియు నిధిధ్యాసనము చేయగల వారు బహు అరుదుగా ఉంటారు.
ఆత్మ దర్శనం కష్ట సాధ్యం. ధ్యానశీలుడైన ధీరుడు ఇంద్రియాలను, విషయాల నుండి మరల్చి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆ పరమాత్మ ను తెలిసికొనుచున్నాడు.
వేదము ఏ పరమపదాన్ని పొం దదగినదిగా బోధిస్తున్నదో , అదే ఓం శబ్ద వాచ్యం. ఓంకారమే అవినాసి అయిన పరబ్రహ్మము. దీని తత్వాన్ని ఎరిగి ఉపాసించే వారు దేనిని కోరితే అది వారికి లభిస్తుంది.
అనాదిగా ఆత్మ బహిర్ముఖమైన మనస్సు ద్వారా ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులపై చరిస్తూ వుంటుంది.
ఆత్మజ్ఞుడైన వ్యక్తి జాగ్రత్ లో స్వప్నంలో, సుషుప్తిలో సాక్షి గా అన్నింటినీ చూడగలుగుతాడు. ఆత్మ జ్ఞాన ము బోధపడిన వారు సర్వ దుఃఖాల నుండి విముక్తిని పొంది ఆనందానుభూతి ని పొందగలడు.
ఓ నచికేత!
ఆత్మకు, 11 ద్వారాలు కలిగిన ఈ దేహమే పురము. జనులు మరణించిన తరువాత వారి వారి కర్మ ఫలితాల ప్రకారం వివిధ దేహాలను పొందుతున్నారు. మరి కొందరు స్థావరరూపాన్ని పొందుతున్నారు.
జాగ్రత్, స్వప్న, సుషుప్తి లలో ఏ చైతన్యము అయితే సాక్షీ భూతంగా మేలుకుని వుందో అదియే ఆత్మ. అటువంటి ఆత్మను ఏ ధీరుడు అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాడో వానికి శాశ్వత సుఖము కలుగుతుంది.
నచికేత!
దేహము నసించినంత మాత్రమున ఆత్మ నసింపదు. ఇంద్రియాల కంటే శబ్దాది విషయాలు గొప్పవి. విషయాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి శ్రేష్ఠం. బుద్ది కంటే ఆత్మ మరింత శ్రేష్ఠం. మహత్ కంటే అవ్యక్తం, అవ్యక్తం కంటే పురుషుడు శ్రేష్ఠం. అట్టి పరమాత్మను పొం దగలగాలి.
నచికేత!
ఈ మార్గము కడు కష్ట తరమైనది. యోగ్యుడైన గురువును చేరి ఆత్మతత్వాన్ని తెలిసికొుటకు సాధకుడు మార్గమును అన్వేషించాలి.
Comments
Post a Comment