సహన గుణం ఓ ధృఢ మైన ఆయుధం.
సహనశీలి అత్యంత బల వంతుడు. సహనం ఓ అద్భుతమైన మానసిక శక్తి. సహన శీలి జీవితం నల్లేరు మీది బండిలా ఒడిదుడుకులులేకుండా సాగుతుంది.సహనాన్ని ప్రదర్శించడంవలన కలిగే ప్రయోజనాలు ఒక్కొక్కప్పుడు వెంటనే వ్యక్తం కావు కానీ దీర్ఘకాలికంగా వాటి ఫలితాలు ఆమోఘంగా ఉంటాయి.
సాధారణంగా మనలను మనము గొప్ప సహన వంతులుగా భావిస్తూ ఉంటాము. వాస్తవంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అసహనం నేను ఉన్నానంటూ తన ఉనికిని ప్రదర్శిస్తుంది. నేటి ఒడిదుడుకుల సామాజిక పరిస్థితులలలో జనులకు సహన గుణం ఎంతో అవసరం.
సమస్యను ఎదుర్కోవడం తప్పని సరి అయినపుడు దానిని ఓర్పుతో ప్రేమతో ఎదుకోవడం సరిఅయిన పద్దతి.ఈ పరిస్థితి ఎంతకాలం భరించాలి? అనుకుంటే ఓర్పు నశిస్తుంది.
ఇతరులఅభిప్రాయాలను గౌర వించడము, ఇతరులతో సామరస్యంగా జీవించడం, వివిధ సంస్కృతులను గౌరవించడం, క్రొత్త ఆలోచనలను,పోకడలను ఆహ్వానించడం, మనోభావాలను ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవడం, అనూహ్య పరిస్థితులు ,వ్యక్తిగత భేదాభిప్రాయాలు కలిగినపుడు ఓర్పు ను ప్రదర్శించడం, సమస్య యొక్క సున్నితత్వం ను గ్రహించి తదనుగుణంగావ్యవహరించడం మొదలైన అంశాలను నిరంతరము అభ్యసిస్తు ఉంటే మనలోని సహన శక్తిని అపరిమితంగా వృద్ధి చెందుతుంది.

శుభం

Comments
Post a Comment